ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దుపోకడలతో తీసుకోనే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వైకాపా ప్రభుత్వం తీసుకోంటున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి అబాసుపాలు అవుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులు ఉండి.. సీఎంకు సహేతుకమైన సలహాలు సూచనలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చాలా మంది సలహాదారులను ఏర్పాటు చేసుకున్నారని, వారు సలహాదారులు, సలహాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సలహాదారులు ఇచ్చే సలహాలను ముఖ్యమంత్రి విస్మరిస్తున్నారన్నారు. కోర్టులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్టే ఇచ్చినా.. ఆ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అని చెప్పినా.. ముఖ్యమంత్రికి చీమ కట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో కోర్టులు ముఖ్య భూమిక పోషిస్తున్నాయన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం అబాసుపాలు: చినరాజప్ప - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వార్తలు
సీఎం జగన్ ఒంటెద్దుపోకడలతో తీసుకోనే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని తెదేపానేత చినరాజప్ప విమర్శించారు. సలహాదారులు ఇచ్చే సలహాలను ముఖ్యమంత్రి విస్మరిస్తున్నారన్నారు. కోర్టులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్టే ఇచ్చినా సీఎంకు చీమ కట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు.
chinarajappa
TAGGED:
ఏపీ తాజా రాజకీయాలు