ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మౌనంగా ఉండకూడదనే.. బయటకు వస్తున్నాం: చినజీయర్‌ స్వామి - attacks on temples in andhra pradesh

రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనలపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు

china jiyar swamy to visit attacked temples in andhra pradesh
విగ్రహాల ధ్వంసంపై చినజీయర్ స్వామి రాష్ట్రవ్యాప్త యాత్ర

By

Published : Jan 5, 2021, 5:22 PM IST

రాష్ట్రంలో దేవుడి విగ్రహాలకు రక్షణ కొరవడిందని చినజీయర్ స్వామి అన్నారు. ఈ నెల 17 నుంచి బాధిత దేవాలయాలు సందర్శించనున్నట్లు తెలిపారు. ఆలయాల ఉనికికి భంగం కలిగింది కనుకే యాత్ర చేపడుతున్నామని పేర్కొన్నారు. మతపరమైన అంశాలకు రాజకీయాలు ముడిపెట్టకూడదని చినజీయర్‌స్వామి అన్నారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే స్థితి వచ్చినపుడు మౌనంగా ఉండకూడదనే తాము బయటకు వస్తున్నామని చెప్పారు.

విగ్రహాల ధ్వంసంపై మాట్లాడుతున్న చినజీయర్ స్వామి

ఆలయాలపై దాడులు నివారించేందుకు సమర్థత ఉన్న నిఘా అధికారులతో కమిటీ వేయాలని చినజీయర్‌స్వామి డిమాండ్​ చేశారు. వరుస దాడులపై మనోభావాలు దెబ్బతిన్నవారికి భరోసా ఇద్దామనే ఉద్దేశం పాలకుల్లో కనిపించడం లేదన్నారు. అంతర్వేది, రామతీర్థంలో స్వామివారికి అపచారం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. గతంలో ఆలయ ట్రస్టీలు, స్థానిక సిబ్బందికి బాధ్యత ఉండేదని.. ఎండోమెంట్‌లో కలిశాకే ఇలా జరుగుతోందని భావిస్తున్నామని చినజీయర్‌స్వామి అన్నారు.

ఇదీ చదవండి: 'లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దేవాలయాలపై దాడులు'

ABOUT THE AUTHOR

...view details