MIRCHI: గుంటూరు యార్డులో రోజురోజుకు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన సరకు క్వింటా రూ.20,000కు పైగా ధర పలుకుతోంది. వారం వ్యవధిలో క్వింటా రూ.4,000 వరకు పెరగడం కర్షకులకు కలిసి వచ్చింది. జూన్ 13న మిర్చి యార్డు తెరిచిన రోజు నుంచి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 13న బాడిగి రకం క్వింటా రూ. 21,500 ఉండగా, 21న రూ. 23,000కు చేరింది. తేజ రకం రూ. 19,500 నుంచి రూ.20,500, అలాగే 334 రకం రూ.19,500 నుంచి రూ. 22,500, 341 రకం రూ.18,500 నుంచి రూ.24,000కు పెరిగింది. సీజన్‌లో విక్రయించకుండా శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతులకు మంచి ధరలు వస్తున్నాయి.
MIRCHI: గుంటూరులో 'మిర్చి' భగభగ.. క్వింటా 20వేలకు పైనే - గుంటూరు జిల్లా తాజా వార్తలు
MIRCHI: గుంటూరు యార్డులో రోజురోజుకు మిర్చి ధరలు పెరుగుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన సరకు క్వింటా రూ.20,000కు పైగా ధర పలుకుతోంది. వారం వ్యవధిలో క్వింటా రూ.4,000 వరకు పెరగడం కర్షకులకు కలిసి వచ్చింది.
మార్కెట్‌లో డీలక్స్ రకంగా పిలుచుకునే నాణ్యమైన సరకు లభ్యత తక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి. నవంబరు నెలాఖరు వరకు కొత్త సరకు వచ్చే అవకాశం లేకపోవడం, చైనాలో సాగులో ఉన్న పంట దెబ్బతినడం, దేశీయంగా డిమాండ్ కొనసాగుతుండటం, గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం శీతల గోదాముల్లో నిల్వలు 40 శాతం తక్కువగా ఉండటంతో కొరత ఏర్పడి ధరలు పెరగడానికి దోహదపడుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది చీడపీడల వల్ల దిగుబడులు తగ్గాయి. ఈ ప్రభావం మిర్చి నిల్వలపై పడింది. అలాగే గతంతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఇవీ చదవండి: