గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. కరోనా కారణంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. యార్డు గౌరవ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే విడదల రజిని, ఛైర్మన్‌గా బొల్లెద్దు చిన్నా, వైస్ ఛైర్మన్‌గా సింగారెడ్డి కోటిరెడ్డి, కమిటీ సభ్యులుగా గౌరి హనుమంతరావు, చింతా సాంబయ్య, షేక్ గాలీబీ, రమావత్ మంగాబాయి, పానాల లక్ష్మి, గుమ్మడి పద్మావతి, మాదం సుజాత, అట్లూరి వెంకటరమణమ్మ, పసికర్ల స్వప్న, ఉప్పాల భాస్కర్‌రావు, కోట వెంకట కృష్ణుడు, దర్శి కోట వెంకట సుబ్బారావు, ఆవుల కోమలి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఝాన్సీరాణి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బొల్లెద్దు చిన్న యార్డు ఛైర్మన్‌గా ఎన్నికకావడం అభినందనీయమని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డు కొత్త పాలకవర్గం సమర్థమంతంగా పనిచేసి రాష్ట్రంలోనే గొప్ప పాలకవర్గంగా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.