గుంటూరు జిల్లా చిలకలూరిపేట 24వ వార్డు తెదేపా అభ్యర్థి సాంబయ్య ఇంటిపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. సాంబయ్య కుమారుడు, భార్యను గాయపరిచారు. ఘటన జరిగిన సమయంలో సాంబయ్య ఇంట్లో లేరు. ఒక్కసారిగా వైకాపా వర్గీయులు దాడికి పాల్పడటంతో సాంబయ్య కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాంబయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులపై వైకాపా శ్రేణుల దాడి
గుంటూరు జిల్లాలో తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వారిని కర్రలతో విచక్షణారహితంగా కొట్టినట్లు అభ్యర్థి భార్య ఆరోపించారు.
చిలకలూరిపేటలో తెదేపా అభ్యర్థి కుటుంబసభ్యులపై వైకాపా శ్రేణుల దాడి