ఉపాధి కోసం రాష్ట్రాలు దాటివచ్చి కరోనా మహమ్మారి కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న వారి వేదనను అధికారులు అర్థం చేసుకున్నారు. కన్నవాళ్లని చూడాలన్న వారి అభ్యర్థనకు స్పందించి స్వస్థలాలకు పంపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న వలస కూలీలను నిన్న రాత్రి ఆర్టీసీ బస్సుల్లో రైల్వేస్టేషన్లకు తరలించారు.
అధికారుల ఔదార్యం.. సొంతూళ్లకు పయనం - లాక్ డౌన్‌తో చిలకలూరిపేటలో వలస కార్మికుల కష్టాలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న వలస కార్మికులను అధికారులు స్వస్థలాలకు పంపించారు. స్పిన్నింగ్, జిన్నింగ్, గ్రానైట్ తదితర పరిశ్రమలలో పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి గత నెలన్నరగా వారు అవస్థలు పడుతున్నారు. తమను స్వగ్రామాలకు పంపించాల్సిందిగా వారు అభ్యర్థించిన తరుణంలో అధికారులు స్పందించారు.

స్వస్థలాలకు పయనమైన చిలకలూరిపేట వలస కార్మికులు
నరసరావుపేట ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇతర రాష్ట్రాల వారిని మంగళగిరి రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కించారు. పంపేముందు వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి.. 'మీరైనా పంపించండి.. మమ్మల్నైనా వెళ్లనివ్వండి'