ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి డబ్బుల్లేక శానిటైజర్​ తాగి వ్యక్తి మృతి - శానిటైజర్​ తాగితే ఏమవుతుంది

శానిటైజర్​ తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరులోని చిలకలూరిపేటలో జరిగింది. ఓ వ్యక్తి మ‌ద్యానికి బానిస‌గా మారాడు. దాంతో అత‌ని భార్య వ‌దిలేసింది. ఈ క్ర‌మంలో ఈనెల 21న మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులు లేక శానిటైజ‌ర్ కొనుక్కుని తాగాడు.

dies-after-drinking-sanitizer
శానిటైజర్​ తాగి వ్యక్తి మృతి

By

Published : Jun 26, 2021, 11:27 PM IST

మద్యం కొనడానికి డబ్బుల్లేక ఓ వ్యక్తి శానిటైజర్​ తాగాడు. తీవ్ర ఆస్వస్థకు గురైన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది.

బాబుగారితోట‌కు చెందిన బెల్లంకొండ వాసు(33) మైదానం ప్రాంతంలో పూలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. మ‌ద్యానికి బానిస‌గా మార‌డంతో అత‌ని భార్య వ‌దిలేసింది. ఈ క్ర‌మంలో ఈనెల 21న మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులు లేక శానిటైజ‌ర్ కొనుక్కుని తాగాడు.

ఆ త‌ర్వాత తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో అత‌డి బంధువులు.. గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి మృతి చెందాడు. వాసు సోద‌రుడు దుర్గాప్ర‌సాద్ ఫిర్యాదు మేరకు చిల‌క‌లూరిపేట అర్బ‌న్ పోలీసుల‌ు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'డ్రగ్స్​ వదిలేద్దాం.. ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపిద్దాం'

ABOUT THE AUTHOR

...view details