ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్​ఆర్ బీమా పథకం నేడు ప్రారంభం

దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల కోసం 'వైఎస్ఆర్ బీమా' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. రైస్ కార్డున్న 1.41 కోట్ల మంది కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.

CM JAGAN
CM JAGAN

By

Published : Oct 21, 2020, 5:22 AM IST

పేదల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రంలో రైస్ కార్డున్న 1.41 కోట్ల కుటుంబాలకు లిబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తరఫున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం 510 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

18 నుంచి 50 ఏళ్ల వయసున్న లబ్ధిదారులు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా 5 లక్షల రూపాయల బీమా పరిహారం నామినీకి అందిస్తారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా 3 లక్షల రూపాయలు ఇస్తారు. 18- 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం పొందితే 1.50 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తారు. ప్రమాదం జరిగిన 15 రోజుల్లోగా బీమా మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది.

ABOUT THE AUTHOR

...view details