చేనేత వృత్తిదారుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే 'వైఎస్సార్ నేతన్న నేస్తం' రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న నేతన్నలకు 24 వేల రూపాయలు అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్న సీఎం... అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో లబ్ధిదారులతో మాట్లాడతారు.
నేతన్ననేస్తం ద్వారా 81,024 మందికి 194.46 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 డిసెంబర్ 21న నేతన్ననేస్తం మొదటి విడత పథకం అమలుచేయగా... కొవిడ్ కారణంగా 6 నెలల ముందే రెండో విడత సాయం చేస్తున్నట్లు తెలిపింది. 103 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుతో పాటు, కొవిడ్ మాస్క్‌లు తయారుచేసిన ఆప్కోకు 109 కోట్ల రూపాయలు అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.