న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాలి: జస్టిస్ ప్రవీణ్‌కుమార్ - ap
గుంటూరు బార్ అసోషియేషన్, జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. న్యాయవాద వృత్తిపట్ల నానాటికీ గౌరవం తగ్గిపోతున్న తరుణంలో.... ప్రమాణాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గుంటూరు బార్ అసోషియేషన్, జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారాంమూర్తితో పాటు గుంటూరు జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అమరావతికి హైకోర్టు తరలివచ్చిన క్రమంలో గ్రామీణ అడ్వకేట్లకు హైకోర్టు కార్యకలాపాలు, నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టులో వాదనలు, న్యాయవాదుల వ్యవహారశైలి ఎలా ఉండాలనే దానిపై జస్టిస్ ప్రవీణ్ కుమార్ గ్రామీణ న్యాయవాదులకు విలువైన సూచనలు చేశారు.