కృష్ణా జిల్లా చెవిటికల్లు, గుంటూరు జిల్లా అమరావతి మధ్య నది ప్రయాణం కేవలం మూడున్నర కిలోమీటర్లే. దశాబ్దాలుగా ఈ దారిలోనే పడవల ద్వారా 2 జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఇబ్రహీంపట్నం సంగమం దగ్గర జరిగిన ప్రమాదంతో ఈ తోవలోనూ అధికారులు పడవలను అనుమతివ్వడం లేదు. ఫలితంగా చెవిటికల్లు నుంచి అమరావతి వెళ్లాలంటే బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరికి 70 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవలసి ఉంటోంది. సమయం వృథాతోపాటు చార్జీల మోత మోయాల్సి వస్తోంది.
2 మైళ్ల దూరం.. 70 కిలోమీటర్ల ప్రయాణం - కృష్ణా జిల్లా చెవిటికల్లు
అధికారుల అనాలోచిత నిర్ణయంతో 2 జిల్లాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిని 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకోవలసిన పరిస్థితి నెలకొంది. నదిపై వంతెన కడితే కష్టాలు తీరుతాయని పెట్టుకున్న మొర ఆలకించే అధికారే కరవై ఇప్పుడు ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు.
2 మైళ్ల దూరానికి 70 కిలోమీటర్ల ప్రయాణం
ఈ మార్గానికే అలవాటు పడిన ప్రజలు... పడవల్లేకున్నా ప్రత్యామ్నాయాలతో ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొంత దూరం నడచి, మరికొంత దూరాన్ని ట్రాక్టర్ల ద్వారా చేరుకుంటున్నారు. కృష్ణానదిలో ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు ఇక్కట్లు ఉండవు... ఉద్ధృతి పెరిగితే మాత్రం ప్రమాదాల బారిన పడుతున్నారు. నది తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా మరింత భయపెడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కష్టాల నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.