ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో నైట్స్ చెస్ అకాడమీ ప్రారంభం - guntur latest news

గుంటూరులో నైట్స్ చెస్ అకాడమీని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రారంభించారు. చదరంగం ఆడడం వల్ల విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని చెప్పారు.

chess acadamy launch at guntur
గుంటూరులో చెస్ అకాడమీ ప్రారంభం

By

Published : Apr 4, 2021, 3:22 PM IST

చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెరుగుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్రరాజు అన్నారు. గుంటూరు రాజేంద్రనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నైట్స్ చెస్ అకాడమీని ఆయన ప్రారంభించారు.

గుంటూరులో చెస్ అకాడమీలు తక్కువగా ఉన్నాయని... చదరంగంపై మక్కువతో కళ్యాణ్ చక్రవర్తి చెస్ అకాడమీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. బాల్యంలోనే చెస్ నేర్చుకుంటే.. ఐక్యూ లెవల్స్ బాగా పెరుగుతాయని గుంటూరు డి.ఎస్.డి.ఓ వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో చెస్ అకాడమీ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, క్రీడాకారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details