గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చిలకలూరిపేటలోని చెంచుకాలనీ వాసులు గురువారం ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వం కేటాయించిన భూములను తమకు దక్కనీయకుండా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ, కొంతమంది వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీవాస్‌కు వినతిపత్రం అందజేశారు.
'చెంచుల భూములకు వైకాపా నేతల మోకాలడ్డు' - narasaraopet latest news
నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చిలకలూరిపేటలోని చెంచుకాలనీ వాసులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే విడదల రజినీ, కొంతమంది వైకాపా నేతలు ఆ భూములు తమకు దక్కకుండా మోకాలడ్డుతున్నారని ఆరోపించారు.
!['చెంచుల భూములకు వైకాపా నేతల మోకాలడ్డు' Chenchus staged a protest at the sub collector's office in Narasaraopet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8919790-204-8919790-1600952304079.jpg)
Chenchus staged a protest at the sub collector's office in Narasaraopet
గత ప్రభుత్వం చిలకలూరిపేటకు చెందిన 18 మంది చెంచులకు ఎకరం చొప్పున భూమి కేటాయించిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ఆయితే ఆ భూమిని లబ్ధిదారులకు అందకుండా చేసేందుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ భూమిని లబ్ధిదారులకు అప్పగించేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని కోరారు.