తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామంలో సర్పంచ్ పైళ్ళ విజయ నర్సిరెడ్డి కరోనా కట్టడికి... ముందు జాగ్రత్త చర్యగా తన సొంత ఖర్చులతో వార్డు మెంబర్ల సహకారంతో గ్రామంలోని ప్రతి వీధిలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
సర్పంచ్ సొంత ఖర్చులతో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి - కరోనా వైరస్ కట్టడి
కరోనా తమ గ్రామానికి సోకకుండా ఓ గ్రామంలో సర్పంచ్ తన సొంత ఖర్చులతో ప్రతి వీధిలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

సర్పంచ్ పైళ్ళ విజయ నర్సిరెడ్డి
కరోనా మన గ్రామానికి రాకుండా అందరూ సహకరించాలని... ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులు చేసేవారు మాత్రం దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి:మలేరియా మందుకు అనూహ్య గిరాకీ