గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెం గ్రామ సర్పంచ్ వాసిరెడ్డి ఇందిర చెక్‌పవర్‌ను ఎట్టకేలకు పునరుద్దరిస్తూ.. జిల్లా పంచాయతీరాజ్ ఆధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. వాసిరెడ్డి ఇందిర.. తెదేపా మద్దతుతో దీపాలదిన్నెపాలెం సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని.. కొందరు వైకాపా నాయకులు పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె చెక్‌పవర్‌ను అధికారులు రద్దు చేశారు.
దీపాలదిన్నెపాలెం సర్పంచ్ చెక్‌పవర్ పునరుద్దరణ
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెం గ్రామ సర్పంచ్ చెక్‌పవర్ పునరుద్దరించారు. న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సర్పంచ్‌గా.. తనకు తెలియకుండా చెక్ పవర్ తొలగించడంపై అధికారులను కలిసి ఆమె విన్నవించుకున్నారు. అయినా న్యాయం జరగలేదు. ఇక చేసేదేమిలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇందిర. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. గత నెలలో చెక్ పవర్ రద్దుకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సంబంధింత ఆధికారులను ఆదేశించింది. తాజాగా ఆ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. ఇందిరకు చెక్‌పవర్ పునరుద్దరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సర్పంచ్ వాసిరెడ్డి ఇందిరకు చెక్ పవర్ అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి:డ్రగ్స్‌కు బానిసైన చిలుకలు.. నల్లమందు కోసం పంటల ధ్వంసం