గుంటూరు జిల్లా కొల్లిపర ప్రాంతానికి చెందిన ఓ యువతికి దావులూరు గ్రామానికి చెందిన దేవరపల్లి సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సునీల్... యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మరణించడంతో... తనను వివాహం చేసుకోవాలని సునీల్‌ను యువతి కోరింది. పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారని సునీల్ ముఖం చాటేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
CHEATING : శారీరకంగా దగ్గరయ్యాడు... పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు - guntur district crime
ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా వివాహం చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగింది.
కొల్లిపరలో ప్రేమ పేరుతో మోసం