గుంటూరులో చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు మోసం(cheating) చేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని బాధితులు అడ్డుకున్నారు. ద్వారక నగర్ కాలనీకి చెందిన సాంబశివరావు.... గత కొంతకాలంగా చిట్టీలు కట్టించుకుంటున్నాడు. చిట్టీల వ్యాపారంతో పాటు వస్త్ర దుకాణాలు, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చెప్పి స్థానికుల నుంచి కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకున్నాడు. అయితే ఏడాది గడిచినా వాటిని తిరిగి చెల్లించలేదు. సాంబశివరావు ఉన్న ఇంటిని కూడా అమ్మేసి వెళ్లిపోయేందుకు యత్నిస్తున్నట్లు తెలుసుకున్న బాధితులు... అతని ఇంటిని చుట్టుముట్టారు. సాంబశివరావుని నమ్మి కోట్లాది రూపాయలు అప్పుగా ఇచ్చామని భాదితులు వాపోయారు. సాంబశివరావును అరెస్టు చేసి... తమ డబ్బును అప్పగించాలని కోరారు.
cheating :చిట్టీల పేరుతో మోసం... పరారయ్యేందుకు యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న బాధితులు - guntur latest news
గుంటూరులో చిట్టీల పేరుతో రూ.కోట్లు కట్టించుకుని ఉడాయించేందుకు సిద్ధమైన వ్యక్తిని బాధితులు అడ్డుకున్నారు. వస్త్ర వ్యాపారం చేస్తున్నానని సాంబశివరావు స్థానికుల నుంచి రూ.కోట్లలో అప్పులు చేశాడు. డబ్బుతో పరారయ్యేందుకు యత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న బాధితులు ... సాంబశివరావు ఇంటిని చుట్టుముట్టారు.
cheating :చిట్టీల పేరుతో మోసం... ఉడాయించేందుకు యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న బాధితులు