ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారంలో వాటా ఇస్తామన్నారు.. కోట్లు దండుకున్నారు - గుంటూరులో 15కోట్లకు మోసం చేసిన వ్యక్తి

వ్యాపారంలో భాగస్వాములను చేస్తానని నమ్మించి కోట్ల రూపాయలకు నామం పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. కూలి పని చేసుకుంటూ  ఉన్నదంతా  అతన్నే నమ్మి కట్టామని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటన  గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది.

నిరసన చేస్తున్న బాధితులు

By

Published : Nov 19, 2019, 10:14 AM IST

నిరసన చేస్తున్న బాధితులు

వ్యాపారంలో వాట ా ఇస్తానని నమ్మబలికి 15 కోట్ల మేర మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. టొబాకో, వైన్​షాపులు నిర్వహిస్తున్న నిమ్మల కిష్టప్ప పలువురి దగ్గర నుంచి నగదు తీసుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా చెల్లించకుండా వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పాడు. మరోవైపు గుమాస్తాల పేరు మీద వైన్​షాపు లైసెన్స్​లు తీసుకోవడమే కాకుండా.. బ్యాంకు రుణాలు సైతం తీసుకున్నాడు. తమ డబ్బులు ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. మరైవైపు తమ పేర్ల మీద తీసుకున్న రుణాలుచెల్లించాలని బ్యాంక్​ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం చేయాలని 23 మంది భాదితులు గుంటూరు గ్రామీణ ఎస్పీని ఆశ్రయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details