గుంటూరులోని నల్లపాడుకు చెందిన యాగయ్య నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసం 3 లక్షల 30 వేలు తీసుకున్నాడు సతీశ్ వర్మ. యాగయ్య చేతిలో నకిలీ నియామకపత్రం పెట్టాడు. అది తీసుకుని సచివాలయానికి వెళ్లిన యాగయ్యకు అక్కడ అలాంటి ఉద్యోగమేదీ లేదని తెలిసి షాక్ అయ్యాడు. ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సతీష్ వర్మను అరెస్టు చేశారు. ఈ మోసంలో పాలుపంచుకున్న వంశీకృష్ణ, షేక్ బాజీ, మేడా వెంకట్రామయ్యను కూడా అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సౌజన్య, కిరణ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు సీఐ అక్కరాజు శ్రీహరి తెలిపారు.
'మంత్రిగారి వద్ద పనిచేస్తున్నా.. మీకు ఉద్యోగాలిప్పిస్తా' - గుంటూరులో ఉద్యోగాల పేరుతో మోసం తాజా వార్తలు
మంత్రిగారి వద్ద పనిచేస్తున్నాను... ఆయన నాకు బాగా తెలుసు... మీకు ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. పౌరసరఫరాల శాఖలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న సతీష్ వర్మ ఈ మోసంలో కీలకపాత్ర పోషించాడు.
!['మంత్రిగారి వద్ద పనిచేస్తున్నా.. మీకు ఉద్యోగాలిప్పిస్తా' అరెస్టైన నలుగురు నిందితులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8984485-466-8984485-1601385077566.jpg)
అరెస్టైన నలుగురు నిందితులు
TAGGED:
gunturu crime latest news