Changes in AP High Court Roster : హైకోర్టు న్యాయమూర్తులు సోమవారం నుంచి విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నలుగురి జడ్జీల రాకతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ (Justice Dhiraj Singh Thakur) ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రోస్టర్‌లో మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని బెయిలు పిటిషన్లు, 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన కేసులను విచారించే బాధ్యతను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావుకు కేటాయించారు.
AP Skill Development Case :దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ టి.మల్లికార్జున రావు వద్ద సోమవారం విచారణ జాబితాలో వచ్చాయి. జస్టిస్ బీఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఎఫ్‌ఐఆర్/ ఛార్జిషీట్ల క్వాష్ పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. హైకోర్టు జడ్జిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌కు సింగిల్ బెంచ్ కేటాయించారు.
AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
Justice Dheeraj Singh Thakur orders to Changes in Registrar Roster :తాజా జడ్జీలు మరో ముగ్గురు.. సీనియర్ జడ్జీలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవీ శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్‌తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్‌లో పాల్గొని కేసులను విచారిస్తారు.