సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారని తెలుగుదేశం అధినేత కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఏ మాత్రం అందుబాటులో లేని రోజుల్లోనే రెండు జిల్లాల పరిధిలో ఆనకట్టను, కాలువల వ్యవస్థలను కేవలం అయిదేళ్ల వ్యవధిలో పూర్తి చేసిన కాటన్ సంకల్పం మాటలకు అందనిదన్నారు.
కాటన్ దొరకు నివాళులర్పించిన చంద్రబాబు - కాటన్ జయంతికి చంద్రబాబు ట్వీట్
సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. నీటితో ప్రజల తలరాతలను మార్చవచ్చునని కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం పూర్తికి సంకల్పించామని ట్వీట్ చేశారు.
కాటన్ దొరకు నివాళులర్పించిన చంద్రబాబు
నీటితో ప్రజల తలరాతలను మార్చవచ్చని నిరూపించిన కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం పూర్తికి సంకల్పించిన తెలుగుదేశం 70 శాతం పని పూర్తి చేయగలిగిందన్న ఆయన, అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పడకేయడం బాధాకరమన్నారు. కాటన్ జయంతి సందర్భంగా ఆ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళులంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి:రాయితీలు ఇవ్వకపోతే కట్టేదెలా? అమ్మేదెలా?