మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైకాపాకు పుట్టుకతో వచ్చిన సిద్ధాంతమని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమన్న ఆయన.. వైకాపా మాదిరిగా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైకాపా కావాలనే కులచిచ్చు రగిలిస్తోందని ధ్వజమెత్తారు. తాను క్రిస్టియన్, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే.. వైకాపా దళిత మహిళగా రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైకాపా కాదా అని ఎస్సీలే నిలదీస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాజకీయ లబ్ధికోసం వైకాపా కులచిచ్చు రగిలిస్తోంది: చంద్రబాబు
కుల, మత ఘర్షణలు సృష్టించడం వైకాపా ప్రవృత్తని... తెదేపా అధినేత చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. బలహీనవర్గాల కోసం తెదేపా నిరంతరం పాటుపడుతుందని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధికోసం వైకాపా కులచిచ్చు రగిలిస్తోంది : చంద్రబాబు