ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి బహిరంగసభకు బయల్దేరిన చంద్రబాబు - అమరావతికి మద్దతుగా సభ

గుంటూరు జిల్లా తెనాలి బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు బయల్దేరారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నారా లోకేశ్​, ఇతర ఐకాస నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

బహిరంగసభకు బయల్దేరిన చంద్రబాబు
బహిరంగసభకు బయల్దేరిన చంద్రబాబు

By

Published : Feb 4, 2020, 4:14 PM IST

బహిరంగసభకు బయల్దేరిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించే బహిరంగ సభకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరారు. మధ్య జాతీయ రహదారి మీదుగా తెనాలికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నారా లోకేశ్​, ఇతర ఐకాస నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. జై అమరావతి నినాదాలు చేస్తూ.. దారిపొడవునా మహిళలు, రైతులు చంద్రబాబుకు మద్దతు పలికారు.

ఏర్పాట్లు పూర్తి

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా అధికార ప్రతినిధి పంచుమూర్తి అనురాధలు సభా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మన అమరావతి మన రాజధాని పేరుతో మరికొద్దిసేపట్లో చంద్రబాబుతో పాటు జేఏసీ నాయకులు సభలో ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details