ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆత్మాభిమానం- అరాచకం నడుమ పోరు' - teli

"ఎన్నికలకు అన్నివిధాలా సమాయత్తమయ్యాం. మీ భవిష్యత్ నా బాధ్యత నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 30 రోజుల సమగ్ర ప్రణాళికతో కదం తొక్కాలని ఉద్ఘాటించారు."

చంద్రబాబు

By

Published : Mar 11, 2019, 9:41 AM IST

Updated : Mar 11, 2019, 1:09 PM IST

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికలకు అన్నివిధాలా సమాయత్తమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ చేసిన చంద్రబాబు.. ఎన్నికల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఎంత సన్నద్ధంగా ఉన్నా... అవతలి పార్టీ నేర చరిత్ర కలిగి ఉందన్నవిషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. నేటినుంచి నెల రోజుల పాటు ప్రతి ఒక్కరిలోనూ అప్రమత్తత అవసరమని తెలిపారు. ఎన్నికల యుద్ధానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని గుర్తు చేశారు. మీ భవిష్యత్ నా బాధ్యత నినాదాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ఆత్మాభిమానానికి, అరాచకానికి మధ్య జరుగుతున్న పోరు అని వ్యాఖ్యానించారు.

30 రోజుల సమగ్ర ప్రణాళికతో కదం తొక్కుదామని తెదేపా శ్రేణులను ముఖ్యమంత్రి ఉత్తేజపరిచారు. సంక్షేమ పథకాలు ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేసేలా ప్రత్యర్థి పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజులు ముందుకు తీసుకొచ్చారని... రాజకీయ సంక్షోభం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకోవాలని నాయకులకు సూచించారు.

ఇవీ చదవండి..

Last Updated : Mar 11, 2019, 1:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details