Chandrababu Promise as 4 Gas Cylinders under Deepam Scheme: దీపం పథకం కింద 4 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మినీ మేనిఫెస్టోలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన.. అవసరమైతే మరో సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan)లో రాఖీ పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబుకు వంగలపూడి అనిత, పీతల సుజాత, ఆచంట సునీత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu New Vision 2047: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలి : చంద్రబాబు
Chandrababu on Telugu Women: తెలుగు మహిళను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ఉద్ఘాటించారు. బంధాలు భారతీయ సంస్కృతికున్న ప్రత్యేకతని గుర్తుచేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతి (Indian culture) ని మెచ్చుకుంటున్నారని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి టీడీపీ ఎన్నో కార్యక్రమాలు... సంస్థలు స్థాపించిందన్నారు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు ( Right to property ) కల్పించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పద్మావతి మహిళా కళాశాలను నెలకొల్పిందితెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. బాలికా సంవృద్ధి సంరక్షణా పథకం ప్రారంభించానన్న చంద్రబాబు... ఒక విధానంతో ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా విధాన నిర్ణయాలు చేశామన్నారు. మహిళలతో పొదుపు ఉద్యమం చేయించి, ఆత్మగౌరవాన్ని కాపాడామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.