కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాము మొదలుపెట్టిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీని కలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగాలనీ.. కానీ సీఎం జగన్ మాత్రం అభివృద్ధి వదిలి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతలు స్థాయిని బట్టి ఇసుక లారీలు పంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ చేయాలని చూస్తున్నారనీ.. తప్పుడు కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. న్యాయం కోసం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
అమరావతిని నాశనం చేశారు... ఆశలు వమ్ము చేశారు... - followers
"నేను ఇచ్చిన పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని కోసం నేను కష్టపడితే.. నేడు వైకాపా ప్రభుత్వం అమరావతిని చంపేసింది." --చంద్రబాబునాయుడు
కార్యకర్తల్లారా.. న్యాయం కోసం కలిసి పోరాటం చేద్దాం: చంద్రబాబు