Chandrababu Naidu: శిశుపాలుడిలా జగన్ రెడ్డి చేస్తున్న తప్పులు వంద దాటిపోయాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పటం గ్రామానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటేనో, చీకట్లో తన పర్యటనపై రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరని స్పష్టంచేశారు.
శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటిపోయాయి: చంద్రబాబు - వైకాపావి రోడ్లు వేసే మొహాలేనా అని ప్రశ్నించిన బాబు
Chandrababu criticized YS Jagan: శిశుపాలుడిలా జగన్ రెడ్డి చేస్తున్న తప్పులు వంద దాటిపోయాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. వైకాపావి రోడ్లు వేసే మొహాలేనా అని ప్రశ్నించిన బాబు.. కూల్చడం ఆపేసి ఏదైనా నిర్మిస్తే ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu
వైకాపా ప్రభుత్వానికి పోయేకాలం దాపురించడం వల్లే దిక్కుమాలిన పనులు చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. 600 ఇళ్లున్న ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు అవసరమా అని నిలదీశారు. వైకాపావి రోడ్లు వేసే మొహాలేనా అని ప్రశ్నించిన బాబు... కూల్చడం ఆపేసి ఏదైనా నిర్మిస్తే ఆ తృప్తి ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: