ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2023, 6:05 PM IST

ETV Bharat / state

నూతన గవర్నర్​కు.. అభినందనలు తెలిపిన చంద్రబాబు

Governor S. Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు.

cbn
చంద్రబాబు

AP Governor S. Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్తశుద్ధి, నిజాయితీ గల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పదవిలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌ నియమితులయ్యారు.

నూతన గవర్నర్ల వివరాలు...

ఆంధ్రప్రదేశ్‌ - జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
ఛత్తీస్‌గఢ్‌ - బిశ్వభూషణ్‌ హరిచందన్‌
మహారాష్ట్ర - రమేశ్‌ బైస్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ - శివ్‌ ప్రతాప్‌ శుక్లా
అరుణాచల్‌ప్రదేశ్‌ - లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌
సిక్కిం - లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య
ఝార్ఖండ్‌ - సి.పి. రాధాకృష్ణన్‌
అసోం - గులాబ్‌ చంద్‌ కటారియా
మణిపూర్‌ - అనుసూయ
నాగాలాండ్‌ - గణేశన్‌
మేఘాలయ - ఫాగు చౌహాన్‌
బిహార్ - రాజేంద్ర విశ్వనాథ్‌
లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ - బీడీ మిశ్రా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details