Chandrababu met with Guntur Janasena leaders: ప్రతీ కార్యక్రమంలో తెలుగుదేశం-జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసైనికులకు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్ను ఇంటికి సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. జనసేన పార్టీ కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు చంద్రబాబుని కలిశారు. తెలుగుదేశం - జనసేన కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ - ఆదుకుంటామని రైతులకు హామీ
తెలుగుదేశం-జనసేన గెలుపు, మార్పునకు నాంది పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకుందామన్నారు. మోసం చేయటంలో, నేరాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని మండిపడ్డారు. సిగ్గు, ఎగ్గూ లేని వైసీపీ పాలకుల్ని చూసి ప్రజలు రోషం తెచ్చుకోవాలన్నారు. రైతుల తరఫున రాజీలేని పోరాటం చేసి వారికి అండగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. నేరాలు చేసే వ్యక్తిని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా పెట్టి, ప్రశాంతమైన పల్లెల్లో జగన్ చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లకంటే ముందు, ఇప్పుడు ఎవరి జీవన ప్రమాణాలైనా బాగుపడ్డాయా అని ప్రజలంతా ఆలోచన చేయాలని తెలిపారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చే ఈనాడు - ఈటీవీ ప్రజలు చూడకూడదని జగన్ చెప్తున్నాడు. సాక్షి మాత్రమే ప్రజలు చూసి మోసపోవాలట అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.