Chandrababu All party meeting in Delhi: ప్రధాని మోదీ నేతృత్వంలో దిల్లీలో జీ-20 అఖిలపక్ష సమావేశం 2 గంటలకు పైగా భేటీ సాగింది. జీ-20 సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు. డిజిటల్ నాలెడ్జ్ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ మొదటి లేదా రెండోస్థానానికి చేరనుందని సమావేశంలో వివరించారు.
దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలి: చంద్రబాబు
All party meeting in Delhi: దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు తెలిపారు. మానవ వనరులు, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానంతో అద్భుత ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.
Chandrababu All party meeting
దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని చెప్పిన చంద్రబాబు.. వారికి అవకాశాలు సృష్టించేలా పాలసీల రూపకల్పన జరగాలన్నారు. మానవ వనరులు, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానంతో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం జరిగిన సమావేశాల్లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం అధినేత సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు. భేటీ తర్వాత ప్రధాని మోదీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును పలకరించారు.
ఇవీ చదవండి: