ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా విద్యార్థులను ఆదుకోండి: మహా సీఎంకు చంద్రబాబు లేఖ - మహారాష్ట్ర సీఎంకు చంద్రబాబు లేఖ

షోలాపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. 156 మంది విద్యార్థుల దుస్థితిపై తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

chandrababu letter to maharastra cm
chandrababu letter to maharastra cm

By

Published : May 6, 2020, 8:21 PM IST

కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్​డౌన్ అమల్లో ఉంది. షోలాపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత ప్రాంతాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

156 మంది విద్యార్థుల దుస్థితి పై తక్షణమే దృష్టి సారించాలని చెప్పారు. వారి అవసరాలను తీర్చటంతో పాటు సురక్షితంగా వారిని తెలుగు రాష్ట్రాలకు పంపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల వివరాలు విడిగా మెయిల్ ద్వారా పంపుతున్నట్టు తెలిపారు.

షోలాపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల పై మాజీమంత్రి అఖిలప్రియ పెట్టిన ట్వీట్ ను ఉద్ధవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై చంద్రబాబు... ఉద్ధవ్ థాక్రే కు విడిగా లేఖ రాశారు.

ఇవీ చదవండి:

ఆటో, బ్యాంకింగ్ జోరు- నష్టాలకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details