రాష్ట్రానికి నీళ్లు రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు వేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. విభజన హామీలు అడిగితే ఐటీ , ఈడీ దాడులు చేయించారని అన్నారు. అలాంటి వారితో జగన్ జతకట్టారని విమర్శించారు. కేసుల కోసం జగన్ ఊడిగం చేయడానికి సిద్ధపడ్డారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మనవాళ్ల ఆస్తులపై కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రానికి నీళ్లు రాకుండా.. కేసీఆర్ కుట్రలు: చంద్రబాబు - kcr
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి చెందేవాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాష్ట్ర యువతకు గార్డియన్గా ఉండి అభివృద్ధిలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు