ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ అంతా అంకెల గారడీనే అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మూలధన వ్యయం సగం కూడా ఖర్చు చేయలేదని... అరకొర బడ్జెట్తో జలవనరుల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారిన బిల్లులు ప్రవేశపెట్టుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కడా చూపించకుండా అప్పులు మాత్రమే చూపుతున్నారని ఆరోపణలు చేశారు. ఏడాదిలో విధ్వంసానికి నాంది పలికారు తప్ప అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నించారు.అసెంబ్లీ జరిగిన తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని అన్నారు.