ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర' - ysrcp

ప్రభుత్వం ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా అంటూ తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆశావర్కర్లను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. 10 వేల రూపాయలు జీతం పెంచామని చెప్పి...ఫోటోలకు ఫోజులిచ్చి..మరో పక్క ఉద్యోగం నుంచి తీసేసే జీవో ఇవ్వడంపై ఆయన ధ్వజమెత్తారు.

chandrababu-fire-on-ycp

By

Published : Aug 26, 2019, 4:03 PM IST

ఆశా వర్కర్లను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా అని దుయ్యబట్టారు. ఆశావర్కర్లకు 10 వేల రూపాయల జీతం పెంచేశామంటూ ఫోటోలకు ఫోజులిచ్చి.. మరో పక్క ఏకంగా ఉద్యోగం నుంచి తీసేసే జీవో ఇవ్వడంపై ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళ కష్టానికి గ్రేడులేంటని ప్రశ్నించిన చంద్రబాబు.. చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారంటూ ఆక్షేపించారు. ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు 10 వేల రూపాయల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలన్నారు. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథను వైకాపా వాళ్లు సృష్టిస్తారన్న చంద్రబాబు... ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా వారికి అది మామూలే అంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు.

చంద్రబాబు ట్వీట్​
చంద్రబాబు ట్వీట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details