Chandrababu Instructions to Lokesh: మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అత్యధిక మెజార్టీతో మంగళగిరిని గెలిచి చరిత్ర తిరగరాయాలని నియోజకవర్గ సమీక్షలో మంగళగిరి ఇంఛార్జ్ లోకేశ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాజా సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చంద్రబాబు సమీక్షించారు. 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో తెదేపా గెలిచిందన్నారు. తాను ఓడిపోయినా, తెదేపా ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యానని లోకేశ్.. అధినేతకు వివరించారు. తెదేపా అందించే సహాయాలే కాకుండా,.. తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నానని లోకేశ్ తెలిపారు.
మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి.. చరిత్ర తిరగరాయాలి:చంద్రబాబు - గెలుపుపై లోకేశ్‌కు చంద్రబాబు దిశానిర్దేశం
Chandrababu Instructions to Lokesh: అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో గెలవాలని లోకేశ్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని సమష్టిగా పని చేస్తూ.. తిరుగులేని విజయం సాధించాలని లోకేశ్‌కు సూచించారు.
లోకేశ్‌కు చంద్రబాబు దిశానిర్దేశం
గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో మంగళగిరి సీటును గెలిచి చరిత్రను తిరగరాయాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచించారు. గెలుపు గ్యారంటీ అని... అలసత్వం వహించకుండా సమష్టిగా పనిచేస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని,.. ప్రజల్ని చైతన్యం చేయడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: