Mirchi Farmers Problems in AP: రాష్ట్రంలోని మిర్చి రైతుల కష్టాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.
మిర్చి రైతుల సమస్యలపై.. వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి: చంద్రబాబు - గుంటూరు జిల్లా వార్తలు
Chandrababu on Mirchi Farmers Problems: మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకంతో పెట్టుబడి రెట్టింపు అవుతుందని తెలిపారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని కోరారు.
![మిర్చి రైతుల సమస్యలపై.. వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి: చంద్రబాబు Chandrababu on Mirchi Farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17456289-377-17456289-1673430469569.jpg)
చంద్రబాబు
మిర్చి రైతుల కష్టాలపై వ్యవసాయ శాఖ స్పందించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నల్ల తామర పురుగుతో మిర్చి రైతులు వరుసగా రెండో ఏడాది కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంటను కాపాడుకునేందుకు రకరకాల మందుల వాడకంతో పెట్టుబడి రెట్టింపు అవుతుందని వివరించారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని కోరారు. తామర పురుగు నివారణపై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: