ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 11, 2020, 1:13 AM IST

ETV Bharat / state

'కనీస సౌకర్యాలు కల్పించమన్నందుకు వైద్యుడిని అరెస్ట్ చేస్తారా?'

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన కరోనాపై సమీక్షలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైద్యుడు సోమ్లూ నాయక్​ను అరెస్ట్ చేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించమని అడిగితే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు.

chandra babu
chandra babu

మాస్కు అడిగినందుకు ఎస్సీ వైద్యుడిని దారుణంగా హింసించిన ప్రభుత్వం... ఇప్పుడు కనీస సౌకర్యాలు కల్పించమని అడిగిన నాదెండ్ల గిరిజన వైద్యాధికారిని అరెస్టు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనా కేసులు పెరడానికి కారణం ప్రభుత్వమా లేక ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులా అని నిలదీశారు. లాక్ డౌన్ సమయంలో ర్యాలీలు, సభలు నిర్వహించి వైకాపా నేతలే వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపించారు.

నరసరావుపేటలో నిర్వహించిన సమావేశంలో ఎక్కడా భౌతిక దూరం పాటింపచేయలేదని చంద్రబాబు విమర్శించారు. గిరిజన వైద్యాధికారిని డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం ఏమిటని ఆక్షేపించారు. ఇదేం జులుం అని మండిపడిన చంద్రబాబు....డాక్టర్ సోమ్లూ నాయక్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన మీద తీసుకున్న చర్యలన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details