ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: తెదేపా నేతలు

By

Published : Apr 20, 2021, 10:02 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును మంగళగిరి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పురోగతికి తిరిగి చంద్రబాబు అవసరమని నేతలు అన్నారు.

cbn birthday
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ కటౌట్​ ఏర్పాటు చేశారు. తాడేపల్లి మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ చౌదరి ఏర్పాటు చేసిన కటౌట్​ దగ్గర మహిళా కార్యకర్తలు కొబ్బరి కాయలు కొట్టారు. స్వర్ణాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రం మళ్లీ అన్ని రంగాలలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు అధికారంలోకి వస్తేనే సాధ్యపడతుందని నేతలు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details