ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. - tdp live

Chandrababu Announces 5 Lakh Compensation గుంటూరు తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Chandrababu  Announces 5 Lakh
చంద్రబాబు

By

Published : Jan 1, 2023, 10:42 PM IST

5 Lakh Compensation: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, కార్యక్రమం ముగిసి తాను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లినట్లు తెలిపారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని.. ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details