ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి' - chandrababu comments on jagan

ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. విధ్వంసకర రాజకీయాలను పక్కన పెట్టాలని హితవు పలికారు.

chandrababu angry over NTR Statue Destroyed in Tenali
చంద్రబాబు

By

Published : Aug 22, 2020, 3:19 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు వారి కీర్తిని నలుదిక్కులా వ్యాపించేలా చేసిన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడం అంటే... తెలుగు వారి ఆత్మగౌరవం మీద దాడి చేయడంతో సమానమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం విధ్వంసకర రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించి ప్రజలకు అండగా నిలబడుతున్నందుకు వైకాపా నేతలు తట్టుకోలేక ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details