రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగాక ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితులు బాధాకరమన్నారు. వైరస్ ప్రభావం మృతదేహాలపై ఎంతసేపు ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా సోకిన వ్యక్తిని మున్సిపాలిటీ వాహనంలో ఆస్పత్రికి తరలించటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
'అధ్యయనం చేసి.. ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి' - chandra babu on corona
గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. వైరస్ ప్రభావం మృతదేహాలపై ఎంతసేపు ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించారు.
!['అధ్యయనం చేసి.. ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి' chandra babu on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8199643-86-8199643-1595911033376.jpg)
కరోనాపై చంద్రబాబు
ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ... ధైర్యంగా ఉంటే విపత్తును ఎదుర్కోవచ్చని చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తత తప్పదన్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడం సహా... మద్యం, ఇతర వ్యసనాలు మానేయాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. హోం క్వారంటైన్, టెలీ మెడిసిన్‌పై మరింత అవగాహన పెంచాలని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో లక్ష దాటాయ్.. వైరస్‌తో 1,090 మంది మృతి