ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్​ ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు - chandrababu latest news

వైకాపా రాక్షసకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. జగన్​ అండ చూసుకునే రాష్ట్రంలో నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. చేస్తున్న తప్పుడు పనులు సమర్థించుకోవడానికే ఎదురుదాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు.

chandra babu
chandra babu

By

Published : Nov 11, 2020, 10:17 PM IST

అరాచక, అనాగరిక పాలనకు కేరాఫ్ అడ్రస్​గా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా రాక్షసకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆయన... అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంలోకి నెట్టారని మండిపడ్డారు. జగన్​మోహన్ రెడ్డి అండ చూసుకునే రాష్ట్రంలో నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. బుధవారం బాపట్ల పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన చంద్రబాబు... వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రాజకీయ కక్షలతో తెదేపా నాయకుల మైనింగ్ లీజులు రద్దు చేసి... వైకాపాలో చేరితే పునరుద్ధరించారు. ఇలాంటి కక్ష సాధింపు ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు. చేస్తున్న తప్పుడు పనులు సమర్థించుకోవడానికే ఎదురుదాడికి దిగుతున్నారు. దుర్మార్గ పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులే. పిచ్చి తుగ్లక్ మాదిరి జగన్ ఒకటి చెబుతూ మరొకటి చేస్తున్నారు. ఎక్కడ చూసినా హింసాత్మక, భయోత్పాత చర్యలున్నాయి. సుపరిపాలనకు తెదేపా నాంది పలికితే... అసలు పాలననే వైకాపా అటకెక్కించింది. ప్రత్యేక హోదా తేకపోగా వచ్చిన 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పోగొట్టారు. గత 17 నెలల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి- చంద్రబాబు, తెదేపా అధినేత

ABOUT THE AUTHOR

...view details