రాష్ట్రంలోని మద్యం దుకాణాల వద్ద దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మద్యం కోసం ప్రజలు భారీగా వస్తారని గ్రహించకుండా వ్యవహరించారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రణాళిక లేని వైఖరి వల్లే భౌతిక దూరం స్ఫూర్తి దెబ్బతిందని ధ్వజమెత్తారు. కరోనా కేసులు మరిన్ని పెరిగేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరిన దృశ్యాలను ఆ ట్విటర్లో పోస్ట్ చేశారు.