ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయి: చంద్రబాబు - తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు

బీసీలు, దళితులపై వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలపై కూడా వైకాపా అరాచక శక్తులు దాడికి తెగబడుతున్నాయని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు.

chandra babu
chandra babu

By

Published : Jun 1, 2020, 4:51 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరు, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గాలలో తెదేపా కార్యకర్తలపై దాడులు అమానుషమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. మహిళలపై కూడా వైకాపా అరాచకశక్తులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. బీసీలు, దళితులపై వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయని విమర్శించారు. తెదేపా కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరుల ఆస్తులు ధ్వంసం చేశారని చంద్రబాబు ఆక్షేపించారు.

భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడటం, తోటలు తగలబెట్టడం, బోర్లు ధ్వంసం చేయటం తదితర అరాచకాలకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు. డీజీపీ తక్షణమే స్పందించి ఈ దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. బాధితులకు అండగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details