ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో గొలుసు దొంగ అరెస్ట్ - CHAIN SNACHER

గుంటూరులో గొలుసు దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 31 లక్షల విలువగల 1 కేజీ 37 గ్రామాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని.. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఇతను ఇప్పటికి 25 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

గుంటూరులో గొలుసు దొంగ అరెస్ట్

By

Published : Feb 13, 2019, 8:21 PM IST

గుంటూరులో గొలుసు దొంగ అరెస్ట్
గుంటూరులో గొలుసు దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో మహిళల మెడల్లోని ఆభరణాలను చోరీ చేస్తున్న చోరున్ని పట్టుకున్నారు. జిల్లాలోని చేబ్రోలు మండలం వెజెండ్ల గ్రామానికి చెందిన పోతినేని గోపి, తాపీ పనులు చేసుకుంటూ పేకాట, కోడి పందాలు, మద్యానికి అలవాటు పడి అప్పులపాలయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనం ఎంచుకున్నాడు. నిందితుడి నుంచి 31 లక్షల విలువగల 1 కేజీ 37 గ్రామాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని.. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఇతను ఇప్పటికి 25 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన మంగళగిరి టౌన్ పోలీసులను ఎస్పీ విజయరావు ప్రత్యేకంగా అభినందించారు. రివార్డ్స్ కోసం ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details