ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో ఇళ్ల స్వాధీనం.. నేతల ముందస్తు అరెస్ట్ - chadalawada aravindbabu arrested by the police news

టిడ్కో గృహ ప్రవేశాలకు తెదేపా, సీపీఐ పిలుపు మేరకు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్​ చేశారు. నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్​ చదలవాడ అరవింద బాబు, సీపీఐ నేత కాసా రాంబాబులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

tdp leaders arrested by the police
చదలవాడ, రాంబాబుల ముందస్తు అరెస్టు

By

Published : Nov 16, 2020, 4:44 PM IST


నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్​ చదలవాడ అరవింద బాబు, సీపీఐ నేత కాసా రాంబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గత ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అయా గృహాలను లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని తెదేపా, సీపీఐ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా నేతలను ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్​ అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details