గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం సోమవారం పర్యటించనుంది. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో దెబ్బతిన్న పంటలను కేంద్ర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి శాఖల వారీగా రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. ఈ మేరకు కొల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా యంత్రాంగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. తర్వాత పాడైపోయిన పంటలను క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలించనుంది. కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు కేంద్ర బృందం పర్యటన - floods in Guntur district news
గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం కేంద్ర బృందం పర్యటించనుంది. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
flood affected areas in Guntur district