ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన - గుంటూరు కరోనా వార్తలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. గుంటూరు కలెక్టరేట్​లో అధికారులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

central team visits guntur
central team visits guntur

By

Published : May 9, 2020, 3:21 PM IST

కేంద్ర వైద్య నిపుణుల బృందం గుంటూరులో పర్యటిస్తోంది. డాక్టర్ బాబీపాల్, డాక్టర్ నందినీ భట్టాచార్య... జిల్లాలో కరోనా వ్యాప్తిపై గుంటూరు కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల పరిస్థితిని కలెక్టర్ శామ్యూల్ అనంద కుమార్ వారికి వివరించారు. ఇతర సభ్యుల కేంద్ర బృందం గుంటూరు, నరసరావుపేటలోని రెడ్‌ జోన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించనుంది.

కేంద్ర బృందం సభ్యులు జిల్లాలో కరోనా వ్యాప్తి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​ కుమార్ మీడియాకు తెలిపారు. వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు చెప్పారని వెల్లడించారు. ఇప్పటి వరకు యంత్రాంగం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు, గర్భిణుల పట్ల తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారని‌ కలెక్టర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details