గుంటూరు జిల్లాలో నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడిన పంటనష్టాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ బృందం పరిశీలించింది. పొన్నూరు మండలం, చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో నేల వాలిన వరిపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎకరాకు రూ.30వేలు కౌలు చెల్లించి.. సేద్యం చేసేందుకు మరో రూ.25 వేలు ఖర్చు చేశామన్నారు. వారం రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఏర్పడిన తుపాను కారణంగా.. పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: పొన్నూరు ఎమ్మెల్యే
నివర్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పొన్నూరు మండలం మునిపల్లి గ్రామంలో నేల రాలిన పంటలను కేంద్ర బృందానికి చూపించారు.