కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం... గుంటూరు సర్వజనాసుపత్రిని పరిశీలించింది. డాక్టర్ బాబీపాల్, డాక్టర్ నందినీ భట్టాచార్యతో కూడిన ద్విసభ్య బృందం జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడితో సమావేశమైంది. కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
జీజీహెచ్‌కు కేంద్ర బృందం.. వైద్యులకు కీలక సూచనలు - జీజీహెచ్‌ను సందర్శించిన కేంద్ర నిపుణుల బృందం
గుంటూరు సర్వజనాసుపత్రిని కేంద్ర వైద్య నిపుణుల బృందం సందర్శించింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడితో సమావేశమై... కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై బృంద సభ్యులు సమీక్షించారు.
జీజీహెచ్‌ను సందర్శించిన కేంద్ర నిపుణుల బృందం
కోవిడ్-19 జిల్లా ఆస్పత్రిగా జీజీహెచ్‌లో ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రస్తుతం అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను పరీక్షల నిమిత్తం వార్డుల్లో ఉంచుతున్నారు. ఐసోలేషన్ వార్డులను పరిశీలించిన కేంద్ర వైద్య నిపుణుల బృందం.. చికిత్స తీరుకు సంబంధించి సిబ్బందికి కీలక సూచనలు చేసింది.
TAGGED:
central team visit ggh